కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా అక్రమ నిర్మాణాల నివారణకు మరో అడుగు ముందుకేస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థల జాబితాను ఇప్పటికే హైడ్రా సిద్ధం చేసింది. చెరువుల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా రుణాలు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ ఫైర్ అయ్యారు.