సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్‌లో రోజుకో పోస్ట్ పెడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మొదలైన దగ్గర నుంచి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన ట్వీట్స్ చేస్తున్నారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రకాశ్‌రాజ్ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. తాజాగా ఆయన మరో పోస్ట్ చేశారు. ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ..!.. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి’ అంటూ వ్యాఖ్యానించారు.