కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి మరో షాక్ తగిలింది. తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న జానీ మాస్టర్‌పై అతని మాజీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు రేప్ కేసు పెట్టింది. అయితే ఈ కేసులో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్ చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక జానీ ఈ కేసులో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు అతడి బెయిల్‌ను తిరస్కరించడంతో…ఆయనకు రంగారెడ్డి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది.ఈ కేసులో సాధారణ బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు అందుకు అంగీకరించలేదు.