Homeహైదరాబాద్latest Newsపాకిస్థాన్‌కు మరో షాక్.. ఇక పాక్ WTC ఫైనల్ ఆడడం కష్టమేనా..?

పాకిస్థాన్‌కు మరో షాక్.. ఇక పాక్ WTC ఫైనల్ ఆడడం కష్టమేనా..?

పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. బంగ్లాదేశ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాక్‌.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ల్లోనూ ఏకంగా 8వ ర్యాంక్‌కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాక్‌ ఆరో స్థానంలో ఉండేది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (124 పాయింట్లు), భారత్ (120) టాప్‌-2లో ఉన్నాయి. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC- 2025) ఫైనల్ లార్డ్స్‌ వేదికగా జరగనుంది. అయితే WTC పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్‌ మూడోస్థానంలో ఉంది. పాక్‌పై టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్‌ ఇక్కడా ఎనిమిదో స్థానానికి దిగజారడం గమనార్హం. ఈ సిరీస్ తరువాత ఎనిమిదో స్థానానికి దిగజారడంతో దాదాపుగా ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Recent

- Advertisment -spot_img