రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. అయిదోసారి రష్యా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంగళవారం క్రెమ్లిన్ హాల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యర్థులను కనుమరుగు చేసిన పుతిన్, దేశంలోని అన్ని అధికారాలను హస్తగతం చేసుకుని మరింత శక్తిమంతంగా మారిపోయారు.
ఇప్పటికే దాదాపు పాతిక సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్న ఈయన, మరో ఆరేళ్ల పాటు ఉండనున్నారు. దీంతో స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పుతిన్ ప్రస్తుత పదవి కాలం 2030 వరకు ఉంటుంది. ఆ తర్వాత మరోసారి పోటీ చేసేందుకు కూడా పుతిన్‌కు అర్హత ఉంది.