పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్‌టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘దేవర’ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు ఉండగా, ఇవాళ మరో స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. తాజాగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌లతో కనిపించాడు. ‘నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతుంది’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.