హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ సర్కార్ అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఈ సందర్బంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎలివేటెడ్ కారిడార్ కోసం తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ORR వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ సర్కార్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2013 భూ సేకరణ చట్టం సెక్షన్11(1) ప్రకారం మొత్తం 8 నోటిఫికేషన్‌లను ప్రభుత్వం రిలీజ్ చేసింది.