Homeహైదరాబాద్latest News'పుష్ప-2' నుంచి మరో సర్‌ప్రైజ్

‘పుష్ప-2’ నుంచి మరో సర్‌ప్రైజ్

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని మొదటి పాట తాలూకా ప్రోమోను మేకర్స్ నిన్న విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. అయితే మేకర్స్ ఈ ఫుల్ సాంగ్ ని మే 1న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. ఈ ఫస్ట్ సింగిల్ వచ్చే లోపే మరో సెన్సేషనల్ సర్ప్రైజ్ ని అందిస్తున్నట్టుగా తెలిపారు. దీంతో ఈ సర్ ప్రైజ్ ఏంటనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. మరి ఇది పాటకు సంబంధించినదా లేక మరేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img