కజకిస్థాన్ ఘోర విమాన ప్రమాదం మరవకముందే సౌత్ కొరియాలో మరో ప్రమాదం జరిగింది. 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తేన్న విమానం ఓ పక్షి విమానం ల్యాండింగ్ గేర్ ను ఢీకొట్టడంతో అది డ్యామేజ్ అయి గాల్లోనే మంటలు వచ్చాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా రన్వేపై అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.