ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో రేపటి వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఇవాళ రాయలసీమ, ఉత్తరాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.