బంగాళాఖాతంలో ఈ నెల 5న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. కాకినాడ, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇంకా తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది.