ఇదే నిజం : కొమరం భీమ్ జిల్లాలో మళ్లీ పులి దాడి చేసింది. తాజాగా సిర్పూర్ టౌన్ మండలం దుబ్బగూడ గ్రామం దగ్గర లో పత్తి చేనులో ఎరుతుండగా అదే గ్రామానికి చెందిన రౌత్ సురేష్ అనే రైతు మెడ పై పులి దాడి చేసింది అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. పులి గాట్లతో సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సురేష్‌ను చికిత్స నిమిత్తం సిర్పూర్(టి) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శుక్రవారం అదే ప్రాంతంలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది.