టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నట్టు శ్రీనివాస్ తండ్రి, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తెలిపారు. అయితే శ్రీనివాస్ కు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తామని..అంతా ఫిక్స్ అయిందని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని శ్రీనివాస్ తండ్రి సురేష్ వెల్లడించారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన సినిమా ‘భైరవం’. ఈ సినిమా డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.