ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు(50) ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన ప్రొడ్యూస్ చేశారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో ఆయన నిర్మించిన మిరల్, మరకతమణి తెలుగులోనూ విడుదలయ్యాయి. నిర్మాత మృతిపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.