ముంబై నటి కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నటి తమకు భూమి అమ్మలేదని ఈ కేసులో కీలక సాక్షిగా పెర్కొన్న చిందా వీరవెంకట నాగేశ్వరరాజు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు ఆధార్ కార్డులిస్తే తనను, తన అల్లుడిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ కూచిపూడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.