హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాను ముంబైలోని ఓ ఇంట్లో లావణ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. రాజ్ తరుణ్ను తనకు అప్పగించాలని మాల్వితో లావణ్య గొడవ పడింది. తనని మోసం చేసి మాల్వీతో సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్-మాల్వీ సంబంధంపై ముంబై పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. కాగా, రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.