హీరో రాజ్ తరుణ్ ప్రేమాయణం కేసు మరో కీలక మలుపు తిరిగింది. బాధితురాలు లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అయితే.. రాజ్‌తరుణ్ తనని పెళ్లి చేసుకుని పదేళ్లు కాపురం కూడా చేశాడని .. కొద్దీ రోజుల క్రితం అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య ఆరోపించింది. వాటికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసానని చెబుతుంది. మొన్నటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్పిన రాజ్ తరుణ్ .. ఇప్పుడు రూట్ మార్చి విడాకులు ఇస్తానంటున్నాడంటూ అడ్వొకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర మీడియా ముందు వెల్లడించాడు. ముందు పెళ్లి కాలేదని చెప్పి.. ఇప్పుడేమో డివోర్స్ మాట ఎత్తి.. రాజ్ తరుణ్ అడ్డంగా దొరికిపోయాడు.