Homeహైదరాబాద్latest NewsBRS ​లో మరో వికెట్ ఔట్?

BRS ​లో మరో వికెట్ ఔట్?

– కాంగ్రెస్​లోకి బాజిరెడ్డి గోవర్ధన్​
– పార్లమెంటు ఎన్నికల వేళ మరో షాక్​
– నిజామాబాద్​ ఎంపీ బరిలో దించాలని ప్లాన్​
– కానీ షాకిచ్చిన బాజిరెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: BRS లో మరో వికెట్​ ఔట్​ కాబోతున్నట్టు సమాచారం. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్​లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి బాజిరెడ్డికి నిజామాబాద్​ ఎంపీ బరిలో దించాలని బీఆర్ఎస్​ ప్లాన్​ చేసింది. కానీ బాజిరెడ్డి అందుకు సముఖంగా లేరని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరి నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగనున్న విషయం తెలిసందే. ఈ మేరకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో అదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బీఆర్ఎస్ బాజిరెడ్డిని బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్​ పార్టీ నుంచి ఎవరెప్పుడు జంప్ అవుతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. మొన్న అసెబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆ పార్టీ నుండి రోజు రోజుకు వెళ్లి పోయే నాయకుల సంఖ్య పెరుగుతున్నది. నిన్నటికి నిన్న నలుగురు పెద్ద నాయకులు బీజేపీలోకి పోయారు. మళ్లీ ఇప్పుడు మరో జంపింగ్ విషయం సంచలనం కలిగిస్తున్నది.

Recent

- Advertisment -spot_img