కార్తీ, అరవింద్ సామి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘సత్యం సుందరం’. ఈ సినిమాకి ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చూసి తాను చాలా ఏడ్చేశానని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఏది ఎంత గొప్ప సినిమా .. సరళమైన మరియు అందమైన చిత్రంఅని పేర్కొన్నారు. ఈ సినిమాలో అరవింద్ సామి, కార్తీ అద్భుతమైన నటనను కనబరిచారు. సినిమాలోని ప్రతి డిపార్ట్‌మెంట్ అద్భుతం! టీమ్ మొత్తానికి, ముఖ్యంగా చిత్ర దర్శకుడు ప్రేమ్‌కుమార్‌కి అభినందనలు అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ‘సత్యం సుందరం’ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాని నటుడు సూర్య, జ్యోతిక నిర్మించారు.