Anupama : లిప్‌లాక్ సీన్లపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran lip lock in Rowdy boys | ప్రేమమ్ సినిమాతో అందర్నీ మెస్మరైజ్ చేసింది అనుపమ పరమేశ్వరన్.
ఆ సినిమా వచ్చి ఐదేండ్లు పూర్తయింది. కానీ ఒక్కసారి కూడా హద్దు దాటలేదు ఈ మలయాళీ భామ.
తనకంటూ కొన్ని కంచెలు పెట్టుకుని అందులోనే గ్లామర్ షో చేస్తూ వచ్చింది.
కానీ తాజాగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో రూట్ మార్చేసింది అనుపమ పరమేశ్వరన్.
కెరీర్‌లో మొదటిసారి లిప్‌లాక్ సీన్లలోనూ నటించింది. కానీ ఇది ఆమె ఫ్యాన్స్‌కు నచ్చలేదు.
దీంతో సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు.
Nidhhi Agerwal : కాబోయే భర్తపై క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్
Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..
మీమ్స్ చేస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో లిప్‌లాక్ సీన్లపై వివరణ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్.
దిల్ రాజు వారసుడు ( శిరీష్ కుమారుడు ) ఆశిష్ హీరోగా తెరకెక్కిన సినిమా రౌడీ బాయ్స్.
ఇందులో అతనికి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
యంగ్ హీరో పక్కనే నటించడమే కాకుండా అతనితో లిప్ కిస్ సీన్లలోనూ రెచ్చిపోయింది.
ఈ సినిమాలో దాదాపు ఐదు వరకు లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి.
అయితే ఇన్నిరోజులుగా పద్ధతిగా చూసిన అనుపమ పరమేశ్వరన్‌ను అలా చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.
BSNL Prepaid Plans : హైస్పీడ్ డేటాతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్
LIC IPO : త్వరలో ఐపీవోలోకి ఎల్‌ఐసీ
నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా? యంగ్ హీరోలతో ఇలాంటి సీన్లలో నటిస్తావా? డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతావా? అంటూ అనుపమపై సీరియస్ అయ్యారు.
ఆమెపై మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు.
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై అనుపమ పరమేశ్వరన్ స్పందించింది.
ముద్దు సీన్లలో నటించడంపై వచ్చిన మీమ్స్‌ను చూసి ముందుగా అనుపమ పరమేశ్వరన్ నవ్వుకుంది.
అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పింది.
లిప్‌లాక్ సీన్లపై స్పందిస్తూ..అది సినిమాలో భాగం మాత్రమే.. ఆ సినిమాలో కేవలం హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు మాత్రమే ముద్దు పెట్టుకున్నాయని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
ఇకపై ఆశిష్‌ను టచ్ కూడా చేయనని క్లారిటీ ఇచ్చింది.
ఆ సీన్లు ఎందుకున్నాయో సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని చెప్పింది.
ఆ తర్వాత మీరే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని వివరణ ఇచ్చింది.
Jujube : ఈ సీజన్‌లో దొరికే రేగుపండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా