Anushka : అనుష్క(Anushk) శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ”ఘాటి”. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలో నటించే హీరో ఎవరో అని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఈ సినిమా నుండి కొత్త గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.