అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఘాటి’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ కథ ఆంధ్రా ఒడిశా సరిహద్దులో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ చితబృందం ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది అని తెలిపారు. దీనికి సంబందించిన ఒక వీడియోని మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాకి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.