Homeఫ్లాష్ ఫ్లాష్మూగ‌, చెవిటి అమ్మాయిగా అనుష్క

మూగ‌, చెవిటి అమ్మాయిగా అనుష్క

విడుద‌లైన ‘నిశ్శబ్దం’ ట్రైల‌ర్‌
హైదరాబాద్‌: అనుష్క, మాధవన్‌ జంటగా న‌టించిన ‘నిశ్శబ్దం’ అక్టోబ‌రు 2న విడుద‌ల కానుంది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. అనుష్క సాక్షి అనే దివ్యాంగురాలి పాత్ర పోషిస్తున్నారు. ఓ హత్య‌కేసులో నిందితురాలిగా షాలినిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మూగ‌, చెవిటి అమ్మాయిగా ఉన్న అనుష్క సాక్ష్యం ఈ కేసులో కీల‌కంగా మార‌నుంది. హాలీవుడ్‌ నటుడు అండ్రూ హడ్సన్‌, హీరోయిన్ అంజలి క్రైమ్ ఆఫీస‌ర్లుగా సంద‌డి చేయ‌నున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను హీరోలు రానా ద‌గ్గుబాటి, విజ‌య్ సేతుప‌తి ట్విట్ట‌ర్ ద్వారా విడుదల చేశారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిచ‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వ‌హించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img