Anushka Shetty : అనుష్క శెట్టి (Anushka Shetty) అందరు హీరోల సరసన నటించి టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అనుష్క బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా ”ఒక్క మగాడు” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకి వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వం వహించారు మరియు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా 2008లో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య సరసన అనుష్క హీరోయినిగా నటించింది. అయితే ఈ సినిమా చేయడమే తన కెరీర్‌లో చేసిన పెద్ద తప్పుఅని అనుష్క శెట్టి చెప్పింది. ఆ సినిమాలో తాను ఎందుకు నటించానో తనకు తెలియదని చెప్పింది. ఆ తర్వాత అనుష్క మళ్లీ ఎప్పుడూ సీనియర్ హీరోలతో నటించడానికి ధైర్యం చేయలేదని చెప్పింది. ప్రస్తుతం అనుష్క క్రిష్ దర్శకత్వంలో ”ఘాటి” సినిమా చేస్తుంది.