Homeహైదరాబాద్latest Newsఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపట్లో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. స్పీకర్ ఎవరంటే..?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపట్లో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. స్పీకర్ ఎవరంటే..?

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉదయం11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలను స్వీకరించనున్నారు.

అయ్యన్నపాత్రుడు ప్రస్థానం
చింతకాయల అయ్యన్నపాత్రుడు…టీడీపీ సీనియర్ నేత. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజా విజయంతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న…ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించిన… యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు.

డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి…?
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా…టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధా ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సభకు దూరంగా వైసీపీ..
ఇవాళ్టి సభకు వైసీపీ దూరంగా ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ పులివెందులలో జగన్ పర్యటించనున్నారు.

Recent

- Advertisment -spot_img