ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు మద్దతు తెలిపే వారు ‘అవును’ అనమని స్పీకర్ కోరగా.. అందరూ ఓకే అన్నారు. దీంతో యాక్ట్ రద్దు అవుతుందని స్పీకర్ తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి?
ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, వివాదాల్లో ఉన్న భూమి వివరాలను ఓ ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కల్పిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అవుతుంది.
ఈ చట్టంతో.. రైతులు భూములకు దూరం
కార్పొరేట్ కంపెనీలకు భూములు కావాలంటే భూ యజమానుల దగ్గర నుంచి ఎపిఐఐసి భూములను సేకరిస్తుంది. అయితే ల్యాండ్ టైటిల్ చట్టం అమల్లోకి వస్తే రైతులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కార్పొరేట్ శక్తులకు భూములు ధారాదత్తం చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం దీనినెవరూ కోర్టుకెళ్లి సవాలు చేసి న్యాయం పొందే అవకాశం లేదు. ఈ చట్టం అమలైతే భూముల నుండి రైతులు, సన్న, చిన్నకారు రైతులు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం వుంది.