అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ ప్రముఖ దినపత్రికలో పని చేస్తోన్న విలేకరిపై మూకదాడి జరిగింది.
సీఎం జగన్ ప్రసంగం తరువాత అక్కడినుంచి వెళ్తోన్న క్రమంలో కొందరు వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు సమాచారం.
అతడిని చితకబాది సెల్‌ఫోన్ లాక్కున్నట్లు స్థానికులు తెలిపారు.
వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఇబ్బంది పెడుతుండటంతోనే దుండగులు ఈ పని చేసి ఉండొచ్చని వారు అనుకుంటున్నారు.