Ap CM vs Jr NTR : జూనియర్ NTR
చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University)కి వైఎస్ఆర్ (YSR)పేరు పెట్టడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ‘ఇద్దరూ గొప్ప నాయకులని..వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పెట్టడం వల్ల ఆయనకు కొత్తగా వచ్చేది లేదు..ఈయనకు పోయేది లేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం ఒక పేరు మార్పు వల్ల తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కున్న కీర్తి ప్రతిష్టలు తగ్గిపోవు.. ఆయన కీర్తిని చెరిపేయలేరు ‘ అంటూ ట్విట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. దీన్ని బట్టి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా అనే చర్చ జరుగుతున్నది.తన తాత పేరు తీయడం కరెక్ట్ కాదని సున్నితంగా చెబుతూనే ysr కూడా గొప్పవాడని చెప్పి చురకలంటించి జగన్ ఇజ్జత్ తీసాడని చర్చించి కుంటున్నారు.