Homeహైదరాబాద్latest News11 రోజుల పాటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష.. అసలు ఈ దీక్ష...

11 రోజుల పాటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష.. అసలు ఈ దీక్ష ఎందుకంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నారు. పవన్ కల్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష.. 11 రోజుల పాటు జరిగే ఈ దీక్షలో పండ్లు, ద్రవపదార్థాలు మాత్రమే ఆయన తీసుకుంటారు. గత ఏడాది జూన్ నెలలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంగా వారాహిమాతకు పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. రేపటి నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కళ్యాణ్ కు దేవుడి పై భక్తి ఎక్కువని తెలుస్తుంది.. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img