Homeహైదరాబాద్latest Newsపొలిటికల్ డ్రామా ''గేమ్ ఛేంజర్'' మూవీ కోసం రంగంలోకి దిగిన ఏపీ డిప్యూటీ సీఎం..!!

పొలిటికల్ డ్రామా ”గేమ్ ఛేంజర్” మూవీ కోసం రంగంలోకి దిగిన ఏపీ డిప్యూటీ సీఎం..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ లో రామ్ చరణ్ మాస్ అవతార్, ద్విపాత్రాభినయం, బలమైన డైలాగులు ట్రైలర్‌కు పెద్ద హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. జనవరి 4న రాజమండ్రిలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త విన్న మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img