Homeహైదరాబాద్latest NewsAP EAPSET Results : ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!!

AP EAPSET Results : ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!!

AP EAPSET Results : ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌) 2025 ఫలితాలు జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ), కాకినాడలో విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జేఎన్‌టీయూ వీసీ (వైస్‌ ఛాన్సలర్‌) ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇంజనీరింగ్‌ విభాగంలో అనిరుధ్‌ రెడ్డి మొదటి ర్యాంక్‌ సాధించగా, భాను రెడ్డి రెండో ర్యాంక్‌, యస్వంత్‌ సాధ్విక్‌ మూడో ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ కాకినాడ ఈ పరీక్షను నిర్వహించింది. ఈ ఏడాది మే 19 నుంచి 27 వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in/EAPCET కి వెళ్ళండి. హోమ్‌పేజీలో “AP EAMCET Results 2025” లేదా “AP EAPCET Results 2025” లింక్‌ను క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తరువాత ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

Recent

- Advertisment -spot_img