ఏపీలో టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఏపీ మ్యాజిక్ ఫిగర్‌ను కూటమి దాటేసింది. ఏపీలో గెలుపునకు 88 అసెంబ్లీ స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాగా.. 132 స్థానాల్లో కూటమి నేతలు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల సంబరాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి టీడీపీ 110, జనసేన 17, బీజేపీ 5, వైసీపీ 20 స్థానాల్లో ముందందజలో ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల సంబరాలు మొదలయ్యాయి.