ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అలాగే కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.