ప్రముఖ దర్శడైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో ‘వ్యూహం’ సినిమాకు ప్రభుత్వం నుంచి అక్రమంగా నిధులు అందిన వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్ ప్రస్తుత చైర్మన్ జివి రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. ఫైబర్ నెట్ ద్వారా ప్రసారమైన ‘వ్యూహం’ సినిమాకు వ్యూస్ రాకపోయినా… రూ. 1.15 కోట్లు నోటీసుల్లో చెల్లించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినందుకు వడ్డీతో పాటు మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.