ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లిష్‌లో ఉత్తర్వులు ఇచ్చి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని.. రెండు రోజులకు తెలుగులోనూ జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.