డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అరెస్టుపై ఆందోళన ఉంటే హైకోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో.. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఈ నెల 11న కేసు నమోదైంది.