Homeఆంద్రప్రదేశ్​ap news: ఏపీలో మెడికల్ సీట్ల కేటాయింపుపై పిటిషన్

ap news: ఏపీలో మెడికల్ సీట్ల కేటాయింపుపై పిటిషన్

ap news: ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఏపీలో నూతనంగా మంజూరైన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50శాతం సీట్లను బి, సి కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి, కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. తుది ఉత్తర్వులకు లోబడే సీట్ల భర్తీ ఉంటుందని న్యాయస్థానం ఆదేశాల్లో తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img