Homeహైదరాబాద్latest Newsఏపీ రెయిన్ అలెర్ట్.. ఆ తేదీల్లో భారీ వర్షాలు

ఏపీ రెయిన్ అలెర్ట్.. ఆ తేదీల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రెయిన్ అలెర్ట్. తూర్పు హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 25న దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం వాయువ్య దిశగా పయనించి తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకుంటుందని వివరించింది.ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ వివరించింది.

Recent

- Advertisment -spot_img