ఏపీలోని పలు జిల్లాల్లో ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు జాగ్రత్తగలు తీసుకోవాల్సిందిగా అప్రమత్తం చేసింది.