Homeఆంద్రప్రదేశ్​ఎనిమిదోరోజు 10వేలు దాటిన కొత్త కేసులు

ఎనిమిదోరోజు 10వేలు దాటిన కొత్త కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,199 కరోనా కేసులు నమోదవ్వ‌గా 75 మంది క‌రోనా కార‌ణంగా చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 4 లక్షల 65 వేల 730కి చేరాయి. కరోనాతో ఇప్పటివరకు ఏపీలో 4200 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో లక్షా 3 వేల 701 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో 3 లక్షల 57 వేల 829 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 39 లక్షల 5 వేల 775 కరోనా టెస్ట్‌లు చేశారు. జాతీయ స్థాయిలో పాజిటివ్‌ కేసులతో పాటు పాజిటివిటీ రేటులోనూ ఏపీ రెండో స్థానంలోకి వెళ్లింది. ఆయా రాష్ట్రాల్లో చేసిన పరీక్షలు, నమోదైన కేసుల ఆధారంగా పాజిటవీటీ రేటును నిర్ధారిస్తారు.
జిల్లా వారీగా.. తూర్పుగోదావరి జిల్లాలో 10, చిత్తూరు 9, గుంటూరు 9, అనంతపురం జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. కృష్ణా 7, పశ్చిమగోదావరి జిల్లాలో 7, నెల్లూరు 6, కడప 5, కర్నూలు జిల్లాలో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img