Homeహైదరాబాద్latest NewsAP Secretariat Employees : ఏపీ సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్.. రాష్ట్ర ప్రభుతం కీలక నిర్ణయం

AP Secretariat Employees : ఏపీ సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్.. రాష్ట్ర ప్రభుతం కీలక నిర్ణయం

AP Secretariat Employees : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఈ సచివాలయ ఉద్యోగులను డెప్యూట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని జీవో విడుదల చేశారు. అమరావతితో సహా విశాఖపట్నం, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని గ్రామ/వార్డు సచివాలయాల నుంచి మొత్తం 130 మంది ఉద్యోగులను డెప్యుటేషన్ ప్రాతిపదికన ఇన్నోవేషన్ హబ్‌కు కేటాయించారు. అమరావతి సెంట్రల్ హబ్‌కు 30 మంది, విశాఖపట్నం, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురంలో ఒక్కొక్క చోట 20 మంది చొప్పున కేటాయించారు. ఈ ఉద్యోగులు ఎంబీఏ (ఫైనాన్స్), ఎంకామ్, సీఏ, ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ వంటి విద్యార్హతలు కలిగి ఉంటారు. వారి నైపుణ్యాల ఆధారంగా ఆయా విభాగాల్లో వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద ప్రముఖ పారిశ్రామిక సంస్థలు నిధులు సమకూరుస్తాయి. ఈ హబ్ ద్వారా యువతలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పోటీతత్వం వంటి అంశాల్లో శిక్షణ అందించడం జరుగుతుంది. ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు మార్గదర్శనం, పెట్టుబడుల ప్రోత్సాహక ఎకోసిస్టమ్ సృష్టించడంతో పాటు, ఐదేళ్లలో 20,000 స్టార్టప్‌లతో 1000 కోట్ల పెట్టుబడి, 1 లక్ష ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పనిచేస్తుంది.

Recent

- Advertisment -spot_img