Homeహైదరాబాద్latest NewsAPSET ఫలితాలు విడుదల

APSET ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ స్టేట్​ ఎలిజిబిలిటీ టెస్ట్​ (ఏపీ సెట్​) – 2024 ఫరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అసిస్టెంట్​ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు అర్హత కోసం ఈ పరీక్షను ఏప్రిల్​ 24న నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. అర్హత సాధించిన వారి వివరాలు, ఫైనల్​ కీ, ర్యాంక్ కార్డు, సబ్జెక్టుల వారీ కటాఫ్ మార్క్స్​, అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏపీ సెట్​ పరీక్షకు 30,448 మంది హాజరయ్యారు. వీరిలో అర్హత సాధించిన 2,444 మంది అభ్యర్థుల వివరాలను హాల్​ టికెట్​ నెంబర్లతో సహా ప్రత్యేక జాబితాను విశ్వ విద్యాలయ అధికారులు విడుదల చేశారు.

Recent

- Advertisment -spot_img