అమరావతి: ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా అచ్చెన్నాయుడు ఎంపిక దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 27న అచ్చెన్న నియామకానికి సంబంధించిన ప్రకటనతోపాటు ఏపీ నూతన కార్యావర్గాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా కళా వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిది. మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని టీటీడీపీ సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.