Homeహైదరాబాద్latest NewsAP Tenth Results : చరిత్రలోనే అరుదైన రికార్డ్.. టెన్త్‌ ఫలితాల్లో ఒక విద్యార్థినికి 600/600...

AP Tenth Results : చరిత్రలోనే అరుదైన రికార్డ్.. టెన్త్‌ ఫలితాల్లో ఒక విద్యార్థినికి 600/600 మార్కులు..!!

AP Tenth Results : ఏపీ 10వ తరగతి 2025 పబ్లిక్ పరీక్ష నేడు ఫలితాలు విడుదలయ్యాయి. చరిత్రలోనే మొదటి సారి కాకినాడకు చెందిన నేహంజని అనే విద్యార్థిని 600 మార్కులకు 600 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. కాకినాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో ఆమె చదువుకుంది. అలాగే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అమ్మాయి 598 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన పావని చంద్రిక 598 మార్కులు సాధించింది. దీంతో హెచ్‌ఎం విజయ లలిత, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.
ఈ ఏడాది మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు, ఫలితంగా 81.14% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in లేదా SMS, DigiLocker ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img