వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా సీఎం జగన్ ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రాంతమంతా సమానంగా అభివృద్ధి జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.