అమరావతి: రాష్ట్రంలో సహజ వాయువుపై 10 శాతం వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5శాతానికి పెంచింది. కరోనా కారణంగా పన్నులపై గత ఐదు నెలలుగా ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 ఏప్రిల్ నాటికి రూ.4,480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా..కేవలం రూ.1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. పలు ప్రభుత్వ పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజవాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను వసూలు చేస్తోంది.