డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం “అపరిచితుడు”. ఈ సినిమా 2005లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. ఈ అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమా మే 17 న థియేటర్ల లోకి మరోసారి రానుంది. ఈ సినిమాలో సదా హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, వివేక్, నాజర్, కొచ్చిన్ హనీఫా, నేదురుమూడి వేణు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ ఫిల్మ్స్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఇప్పటికే పలు తమిళ చిత్రాలు తెలుగు లో కూడా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అపరిచితుడు చిత్రం రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.