హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. త్వరలోనే సరికొత్త షాపింగ్ మాల్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ అపర్ణ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అపర్ణ సినిమాస్ పేరుతో కొత్త మల్టీప్లెక్స్‌ను నల్లగండ్లలో ఏర్పాటు చేసింది. మే 31 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో 7 స్క్రీన్లు ఉండబోతున్నట్లు సమాచారం. బెస్ట్ సౌండ్ సిస్టమ్, సీటు వద్దకే ఆర్డర్ తదితర అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉండబోతున్నాయి.