Homeహైదరాబాద్latest Newsక్షమాపణలు తెలుపుతూ.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్..!

క్షమాపణలు తెలుపుతూ.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్..!

హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో నిన్న మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ప దాడి చేశారు. దీనిపై స్పందించిన మనోజ్.. తన తండ్రి తరఫున జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి రోజు వస్తోందని తాను ఏనాడూ ఊహించలేదని మంచు మనోజ్ చెప్పారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తన భార్య ఏడు నెలల గర్భవతి ఉన్న సమయంలో బాధలు అనుభవించిందని ఆయన గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బంధువులపై దాడి చేశారని ఆయన తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఆగాను, ఇక ఆగలేనని ఆయన చెప్పారు.తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. అన్ని విషయాలు సాయంత్రం చెబుతానని ఆయన మీడియాకు తెలిపారు. తన తండ్రి దేవుడని.. ఇలా ఉండేవాడు కాదన్నారు. తన తండ్రి స్నేహితులు చెప్పడం వల్లే తాను తిరిగి ఇంటికి వచ్చానన్నారు.

Recent

- Advertisment -spot_img