ఇదేనిజం, నాగర్ కర్నూల్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అక్కడక్కడ డ్యామేజ్ అయినందున వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అయినది కావున హైదరాబాద్, వివిధ జిల్లాల నుంచి వయా కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు శ్రీశైలం వెళ్లే కార్యక్రమాలను కొన్ని రోజులపాటు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ కోరారు.హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వెల్డండ మండలం కొట్ర జంక్షన్ వద్ద మరియు వంగూరు మండలం కొనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఆపివేయడం జగురుతుందని తెలిపారు.కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు వాహనదారులు ఇట్టి విషయంలో పోలీసువారికి సహకరించాలని కోరారు.